మెగా స్టార్‌ ఫ్యామిలీ నుండి ఎంతో మంది స్టార్స్ ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు. అయితే హీరోయిన్స్ గా మెగా ఫ్యామిలీ నుండి అడుగు పెట్టింది కేవలం నిహారిక మాత్రమే అనే విషయం తెల్సిందే.నిహారిక హీరోయిన్ గా పలు సినిమా ల్లో నటించింది. కానీ కమర్షియల్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకోవడం లో విఫలం అయింది. అయినా కూడా ఆమెకు ఆఫర్లు వచ్చాయి. అయితే ఫ్యామిలీ ఆమెకు పెళ్లి సంబంధం చూసి వివాహం చేయడం జరిగింది.

దాంతో నిహారిక సినీ కెరీర్ ముగిసినట్లే అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా పెళ్లి బంధం కు గుడ్ బై చెప్పడం తో పాటు వెంటనే వెబ్‌ సిరీస్ లో నటించింది. ఇండస్ట్రీ లో మళ్లీ సందడి చేసేందుకు ప్రయత్నాలు చేసింది. వెబ్‌ సిరీస్ తర్వాత ఒక సినిమా లో హీరోయిన్ గా నటించాలని భావించింది. కానీ మెగా ఫ్యామిలీ కి చెందిన వారు ఇద్దరు ఆమెను సినిమా ఇండస్ట్రీ లో రీ ఎంట్రీ ఇవ్వడం ను తప్పబడుతున్నారట.

ఇప్పటికే భర్త నుండి దూరంగా ఉంటున్న నిహారిక సినిమా ఇండస్ట్రీ లో రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల పరువు పోవడం తప్ప మరేం లేదు అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. విమర్శలు ఎంతగా వచ్చినా కూడా నేను మళ్లీ సినిమా ల్లో నటిస్తాను అంటూ నిహారిక ముందుకు వచ్చినా కూడా ఆమె తో సినిమా లను చేసేందుకు ముందుకు వస్తున్న ఆ ఇద్దరు అడ్డుకుంటున్నారు అంటూ సమాచారం అందుతోంది. మొత్తానికి నిహారిక మళ్లీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది కానీ, ఎంత వరకు అది వర్కౌట్ అవుతుందో చూడాలి. నిహారిక మళ్లీ సిరీస్ లో నటిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సినిమా ల్లో నటించాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: