సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత అటు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే  అన్న విషయం తెలిసిందే. maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు అందరినీ కూడా మాయ చేసింది. ఇక ఆ తర్వాత తక్కువ సమయంలోనే ఇక స్టార్ హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరూ స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకున్న సమంత.. ఇక తన నటనతో కూడా అదరగొడుతూ ఉంటుంది. ఇక బాలీవుడ్ లో కూడా పలు వెబ్ సిరీస్ లలో నటించి ఆకట్టుకుంది అని చెప్పాలి.


 అయితే నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఏం చేసినా కూడా హాట్ టాపిక్ గా మారిపోతోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా అటు సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడు ముచ్చటిస్తూ ఉంటుంది. అయితే మయోసైటీస్ వ్యాధిబారిన పడిన సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి అమెరికా వెళ్లి చికిత్స తీసుకుంటుంది. ఎప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల సమంత అభిమానులు అందరితో కలిసి ఒక చాట్ సెషన్ నిర్వహించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పింది.


 మీ స్కిన్ ఎందుకు అంత క్లీన్ అండ్ గ్లో గాఉంటుంది అంటూ ప్రశ్నించగా.. అలా ఏమీ లేదు. నన్ను చిన్మయి గ్లాసిగా తయారు చేస్తానని చెప్పింది. నిజానికి నేను మయోసైటిస్ చికిత్సలో భాగంగా చాలా స్టెరాయిడ్స్ తీసుకున్న. ఇక ఇప్పుడు కూడా స్టెరాయిడ్స్ షాట్స్ తీసుకుంటున్న. దీంతో కొంచెం చర్మం సంబంధిత సమస్యలు వస్తున్నాయి. వాటితో చాలా ఇబ్బంది పడుతున్న దాని కారణంగా ఫేసులో మార్పులు కూడా వచ్చాయి. దీనికోసం ఫిల్టర్ వాడాను. అందుకే క్లీన్ గా కనిపిస్తుంది అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఇలా స్టెరాయిడ్స్ వాడినట్లు సమంత కామెంట్ చేయడం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: