ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్స్ గా కొనసాగుతున్న ప్రభాస్.. కేజిఎఫ్ సినిమాతో సెన్సేషన్ విజయని సాధించి పాన్ ఇండియా డైరెక్టర్గా క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ సలార్. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదలైన నాటి నుంచి కూడా అభిమానుల్లో భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోయాయ్ అని చెప్పాలి. అయితే ఇటీవల సలార్ మూవీకి సంబంధించి మినీ టీజర్ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ను ప్రశాంత్ నీల్. డైనోసార్ తో పోల్చడంతో అభిమానుల అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి.


 అయితే భారతీయ సినిమా బాక్సాఫీసును షేక్ చేసిన బాహుబలి హీరో.. ఇక కే జి ఎఫ్ డైరెక్టర్ కాంబో లో మూవీ అంటే ఎలా ఉంటుందో అని చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధమయ్యారు. అయితే వాస్తవానికి ముందుగా అనుకున్న తేదీ ప్రకారం సెప్టెంబర్ 28వ తేదీన సలార్ మూవీ విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా విడుదలను మరోసారి వాయిదా వేశారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని ఉద్దేశంతో వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. ఏదైనా అటు సలార్ అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు. అయితే విడుదల తేదీని వాయిదా వేశారు. కానీ కొత్త విడుదల తేదీన ప్రకటించలేదు మేకర్స్.


 దీంతో సలార్ మూవీ విడుదల ఎప్పుడు ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే నాలుగు డేట్స్ తెరమీదికి వచ్చినట్లు తెలుస్తుంది. సంక్రాంతికి సలార్ చేయాలని అనుకున్నప్పటికీ అప్పుడు నార్తులో బిజినెస్ జరగదని మేకర్స్ భావించారట. ఈ క్రమంలోనే నవంబర్ డిసెంబర్ నెలలో విడుదల ఉంటుందని టాక్ వినిపిస్తుంది. కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం.. 2024 లోనే ఇక సలార్ విడుదలను ఊహించవచ్చు అన్నది తెలుస్తుంది. అయితే సంక్రాంతి బరిలో ఉండొచ్చు.. లేదంటే ఇక మార్చి కి ప్లాన్ చేస్తారట. ఇలా సలార్ వచ్చే ఏడాది సమ్మర్ కి రాబోతుంది అన్నది తెలుస్తుంది. ఈ ఊహాగానాలు మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ని కంగారు పెడుతున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: