టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఇటీవల నటించిన బెదురులంక 2012 సినిమా సైలెంట్గా ఓటీటీ లోకి వచ్చేసింది. ఓటిటి రిలీజ్ కు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు మేకర్స్.  ప్రమోషన్స్ సైతం చేయకుండానే ఈ సినిమాని ఓటీటీ లోకి విడుదల చేశారు. ఈ మేరకు శుక్రవారం నుండి  ప్రముఖ ఓటిటీ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఫన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాతో క్లాక్స్ టాలీవుడ్ కి కరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆగస్టు 25న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా శెట్టి కథానాయికగా నటించగా.. 

అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్ప నేని ఈ చిత్రాన్ని నిర్మించగా, మణిశర్మ సంగీతం అందించారు. సినిమాలో కామెడీ, ఫ్రెష్ కంటెంట్ కి ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. కేవలం నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లో రిలీజ్ అయిన 'బెదురులంక 2012' బాక్స్ ఆఫీస్ వద్ద రూ.7 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు లాభాల్ని అందించింది. చాలాకాలం తర్వాత కార్తికేయ ఈ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. అయితే థియేటర్స్ లో విడుదలై నెల రోజులు కాకముందే 'బెదురులంక 2012' ఓటీటీ స్ట్రీమింగ్ కి

 అందుబాటులోకి రావడం గమనార్హం. ఎందుకంటే ఈమధ్య థియేటర్లో కమర్షియల్ గా సక్సెస్ అయిన మూవీస్ ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కాస్త ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. కానీ థియేటర్లో కమర్షియల్ గా సక్సెస్ అయిన 'బెదురంక 2012' మాత్రం ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది. దీని వెనక కారణం ఏంటో తెలియకపోయినా ఈ చిత్రం త్వరగా ఓటీటీలోకి వచ్చిందనే విషయం తెలిసి పలువురు ఆడియన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'బెదురులంక 2012 మూవీని థియేటర్లో ఎవరైనా మిస్ అయి ఉంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: