శ్రీకాంత్ అడ్డాల తాజాగా పెదకాపు 2 అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా మొత్తం గా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించింది. ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ లో బాగంగా ఈ  మూవీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సి ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ అదిరిపోయే క్రేజీ అప్డేట్ ను తాజాగా ప్రకటించారు. 

సినిమా యొక్క పెయిడ్ ప్రీమియర్స్ ను సెప్టెంబర్ 28 వ తేదీన రాత్రి 9 గంటల 30 నిమిషాలకు షో కు సంధ్య 70 ఎం ఎం , హైదరాబాద్ , ఆర్టీసీ క్రాస్ రోడ్ థియేటర్ లో ప్రదర్శించనున్నట్లు ఈ పెయిడ్ ప్రీమియర్ షో కు సంబంధించిన టికెట్స్ బుకింగ్స్ ను కూడా ఓపెన్ చేసినట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ పెయిడ్ ప్రీమియర్స్ కు కనక హిట్ టాక్ వచ్చినట్లు అయితే ఈ సినిమాకు విడుదల రోజు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: