సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీ 700 కోట్ల కలక్షన్ మార్క్ ను దాటిపోవడంతో ఈ మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని రజినీ అభిమానులు ఆశించారు. అయితే షారూఖ్ ఖాన్ ‘జవాన్’ మ్యానియాతో ‘జైలర్’ కలక్షన్స్ పూర్తిగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ రజనీకాంత్ కెరియర్ లో ల్యాండ్ మార్క్ మూవీగా ‘జైలర్’ మిగిలి పోతుంది.



ఈ పరిస్థితుల మధ్య ఈ మూవీ దర్శకుడు నెల్సన్ గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ‘జైలర్’ కథ రాసుకున్న తరువాత దర్శకుడు నెల్సన్ మొదట్లో మెగా స్టార్ చిరంజీవిని కలిసి ఈమూవీ కథను చెప్పడం జరిగిందట. అయితే అప్పటికే ‘భోళాశంకర్’ మూవీని చేస్తున్న చిరంజీవి ‘జైలర్’ కథను వినగానే అలాంటి కథ తనకు నప్పదు అని అనడమే కాకుండా నెల్సన్ చెప్పిన కథను చాల కాలం పెండింగ్ ఉంచాడట.



దీనితో విసుకు చెందిన నెల్సన్ ఆకథను రజనీకాంత్ కు వినిపించడం అతడు వెంటనే ఓకె చేయడం జరిగిపోయాయట. ఇప్పుడు ఈవార్త మీడియాకు లీక్ కావడంతో చిరంజీవి ‘భోళాశంకర్’ మూవీని మానుకుని ‘జైలర్’ మూవీని చేసి ఉంటే బాగుండేది కదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘భోళాశంకర్’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఆసినిమాను చూసిన చాలామంది చిరంజీవి తన వయసుకు తగ్గ పాత్రలు చేయకుండా ఇంకా హీరోయిన్స్ తో స్టెప్స్ వేయడం ఏమిటి అంటూ కొందరు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.


వాస్తవానికి ‘జైలర్’ లాంటి సినిమాలో నిజంగా చిరంజీవి నటిస్తే ఎంతవరకు మెగా అభిమానులు అదేవిధంగా తెలుగు ప్రజలు చిరంజీవిని ఆపాత్రలో ఆదరిస్తారు అన్నది సమాధానం లేని ప్రశ్న. ఇప్పటికే చిరంజీవి వయసు 70 సంవత్సరాలు దగ్గర పడుతున్న పరిస్థితులలో మంచి పాత్రలు ఎంచుకోమని సలహాలు వస్తున్న పరిస్థితులలో రానున్న రోజులలో చిరంజీవి ‘జైలర్’ లాంటి సినిమాలను ఎంచుకుని సాహసం చేయగలడో లేదో చూడాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: