కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించిన నవీన్ పోలిశెట్టి "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" సినిమాలో హీరో గా నటించి మంచి విజయాన్ని ... మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరచుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈ నటుడు జాతి రత్నాలు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా నవీన్ కి తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను కూడా తీసుకువచ్చింది. ఈ మూవీ తర్వాత ఈ నటుడు ఏ సినిమా చేస్తాడా అని ఎంత ఆసక్తిని కూడా ప్రేక్షకులు చూపించారు.

అలాంటి సమయం లోనే ఈయన అనుష్క హీరోయిన్ గా మహేష్ బాబు పి దర్శకత్వంలో  యు వి క్రియేషన్స్ బ్యానర్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ లో హీరో గా నటించబోతున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. ఇక ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా నవంబర్ 7 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.

ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకోవడంతో ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లకు సంబంధించిన అధికారిక అనౌన్స్మెంట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల ప్లేస్ కలెక్షన్ లు దక్కినట్లు అలాగే ప్రస్తుతం కూడా డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: