
ఇటీవల విడుదలైన ట్రైలర్ లో చూసుకుంటే నువ్వు ఏం కావాలనుకుంటున్నాం అని రామ్ ను ఒక లెక్చరర్ అడుగుతాడు. అయితే సీఎం కావాలనుకుంటున్నాను అంటూ చెబుతాడు రామ్. రీజన్ ఏంటి అని లెక్చరర్ అడిగితే.. ఆ పోస్టులో దమ్ము ఉంది సార్ అంటూ చెబుతాడు. ఎటెల్లిన ట్రాఫిక్ సిగ్నల్ లొల్లి ఉండదు. నోట్లో పైప్ పెట్టి ఊదుడు ఉండదు. మన దగ్గర అయితే స్టేట్ మొత్తం మన ఫ్లెక్సీలే లేస్తాయి. ఇక మన పైసలతో మనకి అన్నదానం చేస్తరు అని చెబుతాడు. అంతలో లెక్చరర్ మాట్లాడుతూ.. అయినా ఎలా అవుతావు అంటూ లెక్చరర్ అడిగితే.. ఇయ్యాలే.. పొయ్యాలే.. గట్టిగా అరిస్తే తోయ్యాలే.. అడ్డం వస్తే లేపాలే అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెబుతాడు రామ్.
ఇయ్యాలే అంటే డబ్బులు ఇయ్యాలే. పొయ్యాలే అంటే మందు పోయ్యాలే. గట్టిగా అరిస్తే జైల్లో తోయ్యాలే. అడ్డం వస్తే వాళ్లను లేపాలే అని చెబుతాడు. అయితే ఈ డైలాగులు ఏపీ సీఎం జగన్ ఉద్దేశించి అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నేటిజన్స్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. గతంలోనూ లెజెండ్, సరైనోడు లాంటి సినిమాలు బోయపాటి శ్రీను ఏపీ సీఎంకు వ్యతిరేకంగా కొన్ని సీన్స్ డైలాగ్స్ రాశాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రామ్ చెప్పిన డైలాగులు కూడా ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సినేరియాకు సరిగ్గా సరిపోతుందని కొంతమంది నెటిజన్స్ అనుకుంటున్నారూ.