తెలుగు చిత్ర పరిశ్రమలో వన్ అఫ్ ది గ్రేట్ ప్రొడ్యూసర్ అశ్వినిదత్ గూర్చి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి టాప్ ప్రొడ్యూసర్స్ లలో ఒకరిగా నిలిచారు. ఆయన చేసిన బెస్ట్ మూవీలో ఒకటి ఐనా 'ఇంద్ర' ఏ రేంజ్ లో ఆడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా ఎన్నో ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన అశ్వినిదత్ చిత్ర పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్య చేసారు.స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.చంద్రబాబు అరెస్టు అక్రమమని రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని విమర్శలు టీడీపీ సానుభూతిపరులు చేస్తున్నారు. ఇక తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమకు చెందిన నటుడు-నిర్మాత మురళీమోహన్, నిర్మాత అశ్వనీదత్ స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వారు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ పై తీవ్రంగా స్పందించారు.

చంద్రబాబు ఏం నేరం చేశారని జైల్లో పెట్టారు అని నటుడు మురళీమోహన్ ప్రశ్నించారు. చంద్రబాబును చూస్తే చాలా బాధగా ఉందన్న ఆయన గ్రహణం పోయి త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని మురళీమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కనీస వసతులు లేకుండా చంద్రబాబును ఖైదీల మధ్య జైల్లో ఉంచారని ఆయన వాపోయారు. చంద్రబాబు అరెస్ట్ ను నిర్మాత అశ్వనీదత్ ఖండించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రసేనదే విజయం అని కూడా ఆయన జోస్యం చెప్పారు. ఇక మరో పక్క చంద్రసేన 160 సీట్లు సాధిస్తుందన్న అశ్వినీదత్ చంద్రసేన అంటే టీడీపీ ప్లస్ జనసేన అని చెప్పుకొచ్చారు. ఇక సినీ పరిశ్రమ నుంచి ఎవరూ రాలేదు ఏమీటీ? అని అడిగితే రాని వాళ్ల గురించి ఇప్పుడెందుకు? సినిమా ఇండస్ట్రీ అంటే నేను మురళీమోహన్ మాత్రమే అనుకుంటా అని అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: