బాలీవుడ్ లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్ ఘోష్.
టాలీవుడ్ లో
మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈమె దాని తరువాత అడపా దడప సినిమాల్లో నటించింది. అనంతరం
ఎన్టీఆర్ నటించిన
ఊసరవెల్లి సినిమాలో
తమన్నా ఫ్రెండ్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. అయితే తాజాగా ఈమె
బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలను చేసింది.
'బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చుంటే నా దుస్తులు కూడా తొలగించే వాళ్ళని, వాళ్లకు టాలెంట్ తో పనిలేదు.. దుస్తులు తీసేసి అమ్మాయిల అందాలు చూపిస్తే చాలు' అంటూ బాలీవుడ్ పై విరుచుకు పడింది. ఈ మధ్యకాలంలో పాయల్ ఘోష్ సోషల్ మీడియాలో పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. గతంలో చాలా సార్లు బాలీవుడ్ ఇండస్ట్రీపై, ఫిలిం మేకర్స్ పై సంచలన ఆరోపణలు చేసి హాట్ టాపిక్ గా మారిన ఈ ముద్దుగుమ్మ హిందీ తో పాటు తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేసి ఎక్కడా నిలదొక్కుకోలేకపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ లో కమిట్మెంట్ పేరుతో లైంగిక దోపిడీలపై సంచలన ఆరోపణలు చేయడంతో ఏకంగా ఇండస్ట్రీకే దూరమైంది. ఆ వివాదం తర్వాత మళ్లీ పాయల్ బాలీవుడ్లో కనిపించింది లేదు. మళ్లీ చాలా రోజుల తర్వాత తాజాగా మరోసారి బాలీవుడ్ పై తనదైన శైలిలో విరుచుకు పడింది. సోషల్ మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రీపై పాయల్ చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి." దేవుడి దయవల్ల సౌత్ సినిమాల ద్వారా పరిశ్రమంలోకి వచ్చాను. అలా కాకుండా ముందే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఉంటే నా దుస్తులు కూడా తొలగించేవారు. అలా చేసి నా పేరు మీద వ్యాపారం చేసుకునేవారు. వాళ్లకి టాలెంట్ తో పనిలేదు. దుస్తులు తీసేసి అమ్మాయిల అందాలు చూపిస్తే చాలు" అని తన సోషల్ మీడియాలో పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ సినీ ప్రతిష్టని మరింత దిగజార్చేలా పాయల్ ఘోష్ తాజాగా చేసిన ఈ పోస్ట్ పై ఇండస్ట్రీ తరఫున ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. నిజానికి బాలీవుడ్లో కమిట్మెంట్ వ్యవహారం ఎలా ఉంటుందో దానిపై ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ సంచలన ఆరోపణలు చేశారు. కంగనా రనౌత్ లాంటి స్టార్ హీరోయిన్ కూడా బాలీవుడ్ పై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో విరుచుకుపడుతుంటుంది.