స్టువర్టుపురం గజదొంగగా తెలుగు రాష్ట్రాలను ముప్పు తిప్పలు పెట్టిన వారిలో టైగర్ నాగేశ్వరరావు కూడా ఒకరు. ఈయన పేరు ఇప్పటికీ అక్కడక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే పేరుతో హీరో రవితేజ ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతున్నారు. డైరెక్టర్ వంశీ కృష్ణ చాలా కష్టపడి స్క్రిప్ట్ వర్క్ చేసి మరి ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పలు రకాల పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆసక్తిని పెంచేసాయి.. ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ కొన్ని గంటల ముందు విడుదల కావడం జరిగింది.


రవితేజ కెరియర్ లోనే అత్యధిక భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టుగా ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. ఈ రోజున ముంబైలో జరిగిన ఒక ఈవెంట్లో ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు .ఇప్పటికే ఈ సినిమా పైన పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. కొన్ని దశాబ్దాల క్రితమే స్టువర్టపురం అనే దొంగలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపించేవి అక్కడ ఎలాంటి లూటీ చేయాలన్న ముందు ఏరియాలలో వేలం పాట పడేవిధంగా ఈ సినిమా ట్రైలర్లు చూపించారు ఆ విధంగా దొంగలలో అతి భయంకరంగా పేరు సంపాదించుకున్న టైగర్ నాగేశ్వరరావు కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.


ఇక ఈ సినిమాలో నాగేశ్వరరావు చుట్టూ కుట్రలో కారణంగా జైలుకు వెళ్లడం ఆ తర్వాత తప్పించుకొని రావడం ఇలాంటి అంశాలు ఈ ట్రైలర్లు చూపించారు. చివరికి అతని కనెక్షన్ సీఎం పీఎం లెవెల్స్ లో ఉన్నట్టుగా ఈ ట్రైలర్లో చూపించారు. మరి ఈ కథ ఏ మేరకు అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ వంశి సక్సెస్ అవుతారేమో చూడాలి ఇందులో రేణు దేశాయ్ స్పెషల్ పాత్రలు నటించింది అలాగే అనుపమ్  ఖేర్ కూడా నటించారు. అక్టోబర్ 20 తేదీన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: