ఈ సంవత్సరం మహావీరుడు  సినిమాతో మంచి విజయం అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్‌. ఇక శివకార్తికేయన్ తాజాగా నటిస్తున్న సినిమా 'అయలాన్‌'. (తమిళంలో 'అయలాన్‌' అంటే 'ఏలియన్‌' అని అర్థం) ఈ సినిమాలో హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఆర్‌.రవికుమార్  ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్‌.రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మేకర్స్‌ లాంఛ్ చేసిన అయలాన్ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ హల్‌ చల్ చేస్తోంది. ఈ పోస్టర్ లో శివకార్తికేయన్‌ గగనంలో విహరిస్తుండగా.. అతడితోపాటే ఏలియన్‌ కూడా వెళ్తున్న లుక్‌ సినిమాపై మంచి క్యూరియాసిటీ పెంచుతోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ ని ఇచ్చారు.ఈ సినిమా టీజర్‌ కు మూవీ మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు.


అయలాన్‌ టీజర్‌ను అక్టోబర్ 06 వ తేదిన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇందులో దీనితో పాటు ఒక ఫొటో కూడా వదిలింది. ఈ ఫొటోలో ఏ.ఆర్‌.రెహమాన్‌తో పాటు శివకార్తికేయన్, రవికుమార్ ఇంకా గ్రహాంతర వాసి టీజర్ కోసం చూస్తున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో రానున్న ఈ సినిమాను సంక్రాంతి పండుగ 2024 కానుకగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయలాన్‌లో శివకార్తికేయన్, రకుల్‌తో పాటు ఇషా కొప్పికర్, శరద్‌ కేల్కర్‌, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్‌ ఇంకా అలాగే బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.చూడాలి ఈ మూవీ ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో..ఈ సినిమా తెలుగు భాషలో కూడా విడుదల కాబోతుంది. శివ కార్తికేయన్ తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. అందువల్ల ఖచ్చితంగా ఈ మూవీ తెలుగులో హిట్ అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: