నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ , నాని సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ సినిమాకు సౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను చాలా రోజుల క్రితమే డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని మొదట చెప్పిన డిసెంబర్ 21 వ తేదీన కాకుండా అంతకు ముందే డిసెంబర్ 7 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు అన్ని ఓకే అయితే ఈ మూవీ ని డిసెంబర్ 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటనను ఈ చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన పనులను మాత్రం ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను మరియు ఒక పాటను కూడా విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలోని రెండవ సాంగ్ ను అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ కి వషిం అబ్దుల్ వహేబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే దసరా మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న నాని మరి ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: