ఇకపోతే గత కొద్ది రోజులుగా ప్రవీణ్, ఫైమా ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు టీవీ స్టేజ్ ల పైనే ఓపెన్గా ఫైమాతో ప్రేమలో పడినట్లు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పడం జరిగింది. అంతేకాదు తమ సొంత యూట్యూబ్ ఛానల్స్ లో తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టడం, ప్రవీణ్ పలుసార్లు ఫైమా ఇంటికి వెళ్లి ఆమె తల్లిని అత్తయ్య అని సన్నిహితంగా పిలవడంతో అందరూ నిజమేనని అనుకున్నారు . త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా తాజాగా ఈ విషయాన్ని ప్రవీణ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రవీణ్ మాట్లాడుతూ ఫైమా తో నా ప్రేమ మొదట ఫ్రెండ్షిప్ తో మొదలయ్యింది. నా జర్నీ ప్రారంభం నుంచి ఆమె నాతోనే ఉన్నారు. అందుకే ప్రేమిస్తున్నానని చెబితే దానికి నో చెప్పింది . నా పరంగా నేను చెప్పాల్సింది చెప్పాను కానీ నిర్ణయం ఆమెకే వదిలేసాను. ఇక ఈమెకు ఇష్టం ఉండవచ్చు.. లేకపోవచ్చు ఇక ఆమె నిర్ణయాన్ని తప్పు పట్టలేము కదా ..అంతేకాదు ఆమె నో చెప్పిందని తనకు దూరంగా నేను ఎప్పుడూ ఉండలేదు. మా మధ్య ప్రేమ లేకున్నా ఫ్రెండ్షిప్ మాత్రం ఉంది అనుకున్నాము. ఒక మంచి ఫ్రెండ్ గా ఎప్పుడు ఆమె వెంట ఉంటాను. కానీ నా ప్రేమను అంగీకరించలేదన్న బాధ మాత్రం ఎక్కువగా ఉంటుంది అంటూ ప్రవీణ్ తెలిపారు. ఒకవేళ భవిష్యత్తులో ఆమె నన్ను ప్రేమిస్తున్నానని చెబితే కచ్చితంగా అంగీకరిస్తాను అంటూ ప్రవీణ్ తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి