టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి పంజా వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన ఉప్పెన మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొండపొలం ... రంగ రంగ వైభవంగా అనే సినిమాలలో హీరోగా నటించాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు ఆది కేశవ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. శ్రీకాంత్ ఏం రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్ర బృందం విడుదల చేయబోతుంది. ఈ సినిమా కోసం విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన పాటలను ఒక్కో దానిని విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని పాఠాలను విడుదల చేశారు. ఇకపోతే రెండు వారాల క్రితం ఈ సినిమా నుండి "లీలమ్మో" అంటూ సాగే ఓ పాటను విడుదల చేశారు. ఇకపోతే ఈ సాంగ్ లో వైష్ణవ్ మరియు శ్రీ లీల తమ డాన్స్ తో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్నారు. అలాగే ఈ సాంగ్ ట్యూన్ కూడా బాగుండడంతో ఈ పాటకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ఇప్పటి వరకు ఈ మూవీ లోని ఈ సాంగ్ 3 మిలియన్ ప్లస్ వ్యూస్ అందుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం కూడా అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే కొండపల్లి ... రంగ రంగ వైభవంగా మూవీ లతో అపజయాలను అందుకున్న వైష్ణవ్ ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: