రోజా కూతురు అన్షు కి రోజాను మించిన అందం అభినయంతో పాటు మానవత్వంతో కూడా రోజా లాగా మంచి పాపులారిటీ అందుకుంది. సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అన్షు పేద పిల్లలకు సైతం సహాయం చేస్తూ ఉంటుంది. ఎప్పటినుంచో అన్షు సినిమాలలో నటించబోతోంది అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. గతంలో విక్రమ్ కొడుకు నటిస్తున్న ఒక సినిమాలో ఈమె హీరోయిన్గా నటించేందుకు సైతం సిద్ధంగానే ఉందంటూ పలు రకాల వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ కూడా రూమర్లు కానీ మిగిలిపోయాయి.
అన్షు మాలిక యాక్టింగ్ డాన్సింగ్ పరంగా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని ఇండస్ట్రీలో వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. చాలా త్వరగానే ఈమె స్టార్డన్ని సొంతం చేసుకోగలరని అభిమానులు సైతం తెలుపుతున్నారు.అన్షును వెండితెర పైన పరిచయం చేయడానికి తెలుగు ఇండస్ట్రీ నే కాకుండా కోలీవుడ్ లో కూడా కొంతమంది డైరెక్టర్లు సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వారంతా అటు రోజా ఇటు సెల్వమని చుట్టూ తిరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రోజా కూతురు వయసు 20 ఏళ్లు రోజా సరైన నిర్ణయం ఇప్పుడు తీసుకుంటే ఈమె రాబోయే రోజులలో స్టార్ హీరోయిన్గా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం రోజా ఎక్కువగా రాజకీయాల వైపే ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి