హృదయ కాలేయం మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని ... మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈ నటుడు కి అనేక సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన ఈయన కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ నటుడు సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన కొబ్బరి మట్ట అనే సినిమాలో హీరో గా నటించాడు. ఇకపోతే ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఈ మూవీ తో సంపూర్ణేష్ క్రేజ్ మరింతగా తెలుగులో పెరిగిపోయింది. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 1 లో కూడా సంపూర్ణేష్ పాటిస్పేట్ చేశాడు. ఇక మధ్యలోనే అందులో ఉండలేక బయటకు వచ్చేసాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన తమిళంలో సూపర్ హిట్ విజయం సాధించిన మండేలా మూవీ.కి అధికారిక రీమేక్ గా రూపొందిన మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు.

మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: