నాచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మృనాల్ ఠాగూర్ ... నాని సరసన మొదటి సారిగా జోడి గా నటించగా ... ఈ సినిమాకు సౌర్యవ్ దర్శకత్వం వహించాడు. వషిం అబ్దుల్ వాహెబ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా డిసెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఓ స్పెషల్ సాంగ్ ఉండనున్నట్లు అందులో మోస్ట్ బ్యూటిఫుల్ నటి శృతి హాసన్ నటించినట్లు ఒక వార్త చాలా రోజులుగా వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే. 

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాలో శృతి హాసన్ ఐటమ్ సాంగ్ లో నటించినట్లు అందుకు సంబంధించిన పాటను సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఇకపోతే శృతి హాసన్ ఈ సినిమాలో "ఓడియమ్మ" అంటూ సాగే స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సాంగ్ కు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ లోని స్పెషల్ సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ మూవీ లో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ లో నటించడంతో ఈ మూవీ.పై ప్రేక్షకుల్లో మరింతగా క్రేజీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే దసరా మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో నానిమూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: