దేశావ్యాప్తంగా కాంతార ప్రీక్వెల్ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు అదిరిపోయే  న్యూస్ చెప్పాడు యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి. ఈయన ప్రస్తుతం తెరకెక్కించేది కాంతార 2 కాదు.. ఆ సినిమాకు సీక్వెల్. 2022లో వచ్చిన మోస్ట్ సర్‌ప్రైజింగ్ బ్లాక్‌బస్టర్స్‌లో ఆర్ ఆర్ ఆర్, kgf ల కంటే కాంతార సినిమా ఖచ్చితంగా ముందు వరసలో ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో ఇంకా భారీ అంచనాలతో వచ్చాయి. కానీ కాంతార మాత్రం ఏ మాత్రం అంచనాలు లేకుండా  ఏకంగా 400 కోట్లకు పైగా వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఈ సినిమా తెలుగులో కూడా దాదాపు 30 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది కాంతార. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా కర్ణాటకలోని భూత కోల సంప్రదాయ నేపథ్యంలో వచ్చింది. కాంతార సినిమాతో రిషబ్ శెట్టి కూడా పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. గతేడాదే 'కాంతార-2' సినిమా కూడా ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం దీని షూటింగ్ చాలా వేగంగా జరుగుతుంది. తాజాగా టైటిల్ టీజర్ కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. అందులో రిషభ్ గెటప్, సెటప్ అంతా కూడా మారిపోయింది. ఆ లుక్ చూస్తుంటేనే బొమ్మ బ్లాక్‌బస్టర్ అని పూర్తిగా అర్థమైపోతుంది.


ముఖ్యంగా గడ్డంతో ఊర మాస్ గా ఉన్న రిషబ్ శెట్టి లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. నిజానికి గతేడాది విడుదలైందే కాంతార 2 సినిమా అని.. ఇప్పుడు వస్తున్నది పార్ట్ 1 అని క్లారిటీ ఫుల్ గా ఇచ్చారు. అది అర్థమవ్వడానికి కాస్త టైమ్ పట్టినా.. ముందు సీక్వెల్ ని చేసి.. ఇప్పుడు ప్రీక్వెల్ చేస్తున్నాడు రిషబ్ శెట్టి. ఎందుకంటే కాంతార కథకి చాలా చరిత్ర ఉందని.. అన్ని విశేషాలు తెలుసుకున్న తర్వాతే షూటింగ్ మొదలు పెట్టామని చెప్పాడు ఈ టాలెంటెడ్ హీరో.ఇక 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం ఖచ్చితంగా సమ్మర్ 2024కి విడుదల చేస్తామని ప్రకటించాడు ఈయన. అయితే ఇందులో తండ్రి పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండబోతుంది. అదే సినిమాకి హైలెట్.హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు రిషబ్. ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు బడ్జెట్ లిమిటేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అందువల్ల దానికి కేవలం 17 కోట్లు మాత్రమే ఖర్చు చేసారు. కానీ ఇప్పుడలా కాదు.. దీనికి ఏకంగా 120 కోట్ల పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: