తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను ... అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్దీ మంది ముద్దు గుమ్మలలో ఒకరు అయినటువంటి మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ బ్యూటీ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన సీత రామం అనే తెలుగు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

మూవీ అద్భుతమైన విజయం సాధించడం అలాగే ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఈ నటి అద్భుతమైన రీతిలో ఆకట్టుకోవడంతో ఈ మూవీ తో మృణల్ కి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా ఈ నటి నాచురల్ స్టార్ నాని హీరోగా సౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన హాయ్ నాన్న అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. 

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించారు. ఇకపోతే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మృణాల్ అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి విచ్చేసింది. ఇకపోతే ఈ సారి లో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఈ బ్యూటీ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలు అన్ని ఈ ముద్దు గుమ్మ వైపే తిరిగాయి. దానితో ప్రస్తుతం ఈవెంట్ కు సంబంధించిన మృణాల్ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: