టాలీవుడ్ లో అరాకొరా సినిమాలతో ప్రేక్షకుల దృష్టిలో పడిన యంగ్ హీరోయిన్స్ లో దక్ష నగర్కర్ కూడా ఒకరు. ముంబై కి చెందిన ఈ బ్యూటీ హైదరాబాద్లోనే పెరిగింది. మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన దక్ష, ఆ తర్వాత నటిగా మారింది. 'హుషారు' సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'జాంబిరెడ్డి' మూవీలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ మూవీలో చిట్టి పొట్టి డ్రెస్సులతో యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఇటీవల మాస్ మహారాజా రవితేజ నటించిన 'రావణాసుర' సినిమాలో కనిపించి ఆకట్టుకుంది. 

అలాగే అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' సినిమాలో స్పెషల్ సాంగ్ లో తన డాన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం తెలుగులో ఈమెకి పెద్దగా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటో షూట్ తో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాట పడని దక్ష నగర్కర్ షేర్ చేసే హాట్ పిక్స్ ఎంతో వైరల్ అవుతుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే తను చేసిన సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఈ బ్యూటీకి ఎక్కువ క్రేజ్ వచ్చిందని చెప్పాలి. 

ఇక తాజాగా దక్ష తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పిక్ నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. పింక్ డ్రెస్ లో ఎద అందాలను చూపిస్తూ ఎరుపెక్కిన బుగ్గలు, లిప్ స్టిక్ పెదాలతో తన కారులో దిగిన ఫోటోను దక్ష అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ మరోసారి ఆమె అందానికి దాసోహం అవుతున్నారు. దీంతో పలువురు నెటిజన్స్ దక్ష లేటెస్ట్ ఫొటోపై..' ఈ ఫొటోలో దక్ష మరింత హాట్ ఉంది, 'లుకింగ్ బ్యూటీ ఫుల్', 'గ్లామర్ క్వీన్ దక్ష', 'గులాబీ లాగా చాలా అందంగా ఉన్నావ్'.. అంటూ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఈ అమ్మడి లేటెస్ట్ పిక్ సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: