ఇటీవల కాలంలో సినిమాలను ఎంత జాగ్రత్తగా తీస్తూ ఉన్నారో ఇక ఆ సినిమాలకు ప్రమోషన్స్ చేయడం విషయం లో కూడా అంతే జాగ్రత్తగా ఉంటున్నారు దర్శక నిర్మాతలు. ఎందుకంటే సరిగా ప్రమోషన్స్ చేసి సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లినప్పుడే ఇక ఆ మూవీ హిట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. ప్రమోషన్స్ లో ఎక్కడ తేడా కొట్టినా కూడా భారీ బడ్జెట్లో తెరకెక్కించిన మూవీస్ కి సైతం డిజాస్టర్ తప్పదు అని చెప్పాలి. దీంతో ఇటీవల కాలంలో ఏకంగా ప్రమోషన్స్ కి సైతం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం.


 అయితే ఏదైనా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతున్న సమయంలో ఇక ఆ మూవీకి సంబంధించిన ఎన్నో ఫోటోలు, వీడియోలు వెనకాల ఉండే స్క్రీన్ పై ప్రదర్శించడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇటీవల నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్  లో మాత్రం ఊహించని పరిణామం ఎదురయింది. ఏకంగా నాని సినిమాకు సంబంధించిన ఫోటోలు కాకుండా విజయ్ దేవరకొండ రష్మిక మందన కు సంబంధించిన ఫోటోలు  ప్రదర్శించడం తో అందరూ షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి.


 ఇదే విషయం గురించి ప్రమోషన్స్ లో పాల్గొన్న న్యాచురల్ స్టార్ నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పెద్ద సినిమాలు కూడా కొన్నేళ్ల తర్వాత ప్రేక్షకులు మర్చిపోతారు. మనం చేసే సినిమాలు గురించి కొన్నాళ్ల తర్వాత కూడా మాట్లాడుకోవాలని నేను కోరుకుంటా అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఫ్రీ రిలీజ్ వేడుకలో విజయ్, రష్మిక ఫోటోలను డిస్ ప్లే చేయడం గురించి మాట్లాడుతూ.. పొరపాటున అలా చేసి ఉంటారు. కావాలని చేసింది కాదు. ఆ ఫోటోలు వస్తాయని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ నాచురల్ స్టార్ నాని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: