సిక్స్ ప్యాక్.. ఇటీవల యువత ఎక్కువగా సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నారు. ఇందుకోసం జిమ్ లకు వెళ్లి వ్యాయామాలు, వర్కౌట్లు చేస్తుంటారు.ఎంతో కష్టపడి సిక్స్ ప్యాక్ కోసం విపరీతంగా ట్రై చేస్తారన్న సంగతి తెలిసిందే.. అంతేకాదు తాజాగా సుమారు సినీ హీరోలు అందరూ సిక్స్ ప్యాక్ చేస్తున్నారు. కానీ హీరోయిన్స్ సిక్స్ ప్యాక్ చూశారా?.అదేంటి హీరోయిన్ సిక్స్ ప్యాక్ ఆ అనుకుంటున్నారా? నిజమేనండి. ఆ సిక్స్ ప్యాక్ హీరోయిన్ కూడా తెలుగు పరిశ్రమకు చెందిన వారు కావడం విశేషం. టాలీవుడ్ పరిశ్రమకు చెందిన హీరో వరుణ్ సందేశ్.. ఆయన సతీమణి వితిక షేరు.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో నటి గా తెలుగు తో పాటు తమిళంలోనూ పలు సినామాల్లో నటించి ప్రేక్షకాదరణ పొందారు.సహా నటుడు వరుణ్ సందేశ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వితిక షేరు. ఆ తరువాత సినిమాలకు ఆమె దూరంగా ఉన్నారు.. అయితే అప్పుడప్పుడు పలు టీవీ కార్యక్రమాల్లో కనిపిస్తుంటారు.. దాంతో పాటు యూట్యూబ్ లో పలు వీడియోలు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటారు.సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటారు వితిక షేరు. ఈ క్రమంలోనే తాజాగా తన జిమ్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశారు. వితిక సిక్స్ ప్యాక్ చూసిన నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే గత కొన్ని రోజుులుగా వితికా తన బాడీ కోసం ఎక్కువగా జిమ్ లో ట్రైన్ అవుతున్నారట. ఈ క్రమంలోనే వితికా తన సిక్స్ ప్యాక్ చూపిస్తూ కొన్ని ఫొటోలను షేర్ చేశారు.ఇప్పటివరకు హీరోల సిక్స్ ప్యాక్స్ చూసిన అభిమానులు, నెటిజన్లు ఓ హీరోయిన్ సిక్స్ ప్యాక్ చూసి అదరహో అంటున్నారు…ఈ క్రమంలోనే నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటంతో వితికా సిక్స్ ప్యాక్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: