ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‏కు కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా తెలుగులో అతనికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇన్నాళ్లు చాక్లెట్ బాయ్‏గా క్రేజ్ ఉన్న ఈ హీరో ఇప్పుడు మాస్ యాక్షన్‏తో ఒక రేంజ్ లో అదరగొడుతున్నాడు.'యానిమల్' మూవీతో ఈ హీరో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‏లో ప్రేక్షకులకు మరో రణబీర్ పరిచయమయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. తండ్రిపై ఓ కొడుకు ప్రేమ మరీ ఈ రేంజ్‏లో…అంత వయోలెన్స్‏గా ఉంటుందా అన్న రేంజ్‏లో ను తెరకెక్కించాడు డైరెక్టర్ సందీప్. ప్రేమకథ..తండ్రి కొడుకుల మధ్య అనుబంధం.. ఎమోషన్స్..బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ మూవీపై ఇప్పటికే పలువురు సినీతారలు ప్రశంసలు కురిపిస్తూ రివ్యూస్ ఇచ్చేశారు. ఇక ఇందులో రణబీర్, తృప్తి దిమిరి నటనను తెగ మెచ్చుకుంటున్నారు అడియన్స్. తాజాగా యానిమల్ మూవీపై ఆసక్తికర పోస్ట్ చేశారు రేణూ దేశాయ్. ఈ మూవీలోని ఫైట్ సీక్వెన్స్ తనకు చాలా నచ్చయని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతుంది.'ఫైనల్లీ నిన్న యానిమల్ సినిమమా చూశాను. నిస్సందేహంగా ఈ మూవీతో ప్రేమలో పడ్డాను. ఈ సినిమా బలహీనమైన గుండె ఉన్నవాళ్ల కోసం మాత్రం కాదు.


ఇందులో బ్లడీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. మీరు ప్రత్యేకమైన అనుభూతిని పొందాలనుకుంటే ఈ మూవీని కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే' అంటూ రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేసింది రేణూ దేశాయ్. దీంతో ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అంతకు ముందు యానిమల్ మూవీపై హీరోయిన్ త్రిష సైతం పొగడ్తలు కురిపించింది. ఈ మూవీ నిజంగా కల్ట్ మూవీ అంటూ స్పందించింది. దీంతో ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు నెటిజన్స్. ఈ మూవీలో స్త్రీని తక్కువ చేసి చూపించే ఇలాంటి చిత్రాలను మెచ్చుకుంటున్నావ్. మరీ మన్సూర్ అలీఖాన్ మాట్లాడితే ఎందుకు వ్యతిరేకించావ్ అంటూ ఆమెని సూటిగా ప్రశ్నించారు. దీంతో ఆమె యానిమల్ పోస్ట్ డెలిట్ చేసింది.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ మూవీకు తెలుగు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటి దాకా యానిమల్ మూవీ రూ. 425 కోట్లకు పైగా రాబట్టింది. అలాగే ఈ మూవీలోని ప్రతి సాంగ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: