యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'.కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తోన్నాడు.ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాతో నితిన్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిస్క్ చేయబోతున్నాడు.డిసెంబర్ 8న ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా నితిన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ చేసిన మూవీగా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ నిలిచింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 24 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ విడుదల అవుతోంది.ఆంధ్రాలో అత్యధికంగా 9 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. నైజాంలో దాదాపు ఏడు కోట్ల వరకు ఓన్‌గానే నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు సమాచారం.అలాగే సీడెడ్‌లో మూడు కోట్లు మరియు ఓవర్‌సీస్‌లో రెండున్నర కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తుంది.గతంలో నితిన్ నటించిన రంగ్ దే సినిమాకు మాత్రమే 24 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ప్రస్తుతం నితిన్‌కు ఉన్న మార్కెట్ ప్రకారం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌తో నితిన్ రిస్క్ చేయబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.నితిన్ సినిమాకి పోటీగా నాని హాయ్ నాన్న సినిమా కూడా విడుదల కాబోతుంది.హాయ్ నాన్న సినిమాతో హీరో నాని నుంచి గట్టి పోటీ ఉండటంతో నితిన్ యూత్ ప్రేక్షకులపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు. మరోవైపు రీసెంట్ గా రిలీజ్ అయిన యానిమల్‌ మూవీ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. యానిమల్ మూవీ ని కాదని యూత్‌ను ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాకు రప్పించడం అంటే ఛాలెంజ్ అనే బాక్సాఫీస్ వర్గాలు చెబుతోన్నాయి.ఈ అడ్డంకులను దాటుకొని నితిన్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ సాధిస్తుందో లేదో చూడాలి.ఇదిలా ఉంటే ఎక్స్‌టా ఆర్డినరీ మ్యాన్ మూవీ లో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. దీనితో సినిమాపై భారీగానే అంచనాలు వున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: