హిందీ లో అనేక సీరియల్ లలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి సీత రామం అనే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా ... నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం ... అలాగే ఇందులో ఈ బ్యూటీ కి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరకడం దానితో ఈ బ్యూటీ కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా మృణాల్ కి తెలుగులో అద్భుతమైన గుర్తింపు లభించింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ హాయ్ నాన్న అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఈ రోజు అనగా డిసెంబర్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ తో పాటు ప్రస్తుతం ఈ నటి విజయ్ దేవరకొండ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో వరుసగా తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న ఎల్లో కలర్ శారీని కట్టుకొని ... రెడ్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ప్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: