నాని సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాయ్ నాన్న సినిమాకు అమెరికాలో సైతం ప్రమోషన్స్ చేస్తున్న ఈ హీరో సినిమా విషయంలో, సినిమా ప్రమోషన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు.హాయ్ నాన్న సినిమాకు 27 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగగా ఈ మొత్తం ఒకింత తక్కువ మొత్తమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.నాని గత సినిమా దసరా 70 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించగా ఆ సినిమా కలెక్షన్లలో సగం కూడా ఈ సినిమా సాధించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. నాని ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. నాని తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. బలగం వేణు డైరెక్షన్ లో నాని హీరోగా ఒక సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది.యల్లమ్మ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. డైరెక్టర్ శౌర్యువ్ మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనడం లేదు. నాని తర్వాత మూవీ దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనుంది. నాని రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. నాని వయస్సు పెరుగుతున్నా ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. నాని ఇతర భాషల్లో సైతం సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. హాయ్ నాన్న మూవీ ఇతర భాషల్లో సైతం విడుదల కానుంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా టాక్ తేలిపోనుంది. నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా నాని వివాదాలకు తావివ్వకుండా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నారు. నాని లిప్ కిస్, లాక్ లాక్ సీన్ల గురించి మాట్లాడుతూ లిప్ లాక్ లో తప్పేముందని నా ఏడేళ్ల కొడుకు ముందే నా భార్యను కిస్ చేస్తానని ముద్దు పెట్టుకోవడంలో తప్పు లేదని ఇది కూడా ప్రేమేనని ఈ ఏజ్ లో వాళ్లకు చూపిస్తున్నామని నాని కామెంట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: