నాని, మృనాల్‌ ఠాకూర్‌, బీబీ కియారా ఖన్నా, అంగద్ బేడీ, జయరామ్‌, ప్రియదర్శి, విరాజ్‌ అశ్విన్‌ నటించిన హాయ్ నాన్న సినిమా నేడు విడుదల అయ్యింది.వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల ఈ సినిమాని నిర్మించగా  శౌర్యువ్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే.. అమ్మ గురించి నాన్న తన కూతురుకి చెప్పే గొప్ప ప్రేమ కథ ఈ సినిమా. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం..గొడవపడి విడిపోవడం..చివరకు కలిసిపోవడం.. ఇలా గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈమధ్య వచ్చిన 'ఖుషి' నేపథ్యం కూడా ఇదే. కానీ ఈ హాయ్‌ నాన్నలో ప్రత్యేకత ఏంటంటే.. ఈ మూవీ లవ్‌స్టోరీలోని ట్విస్టులు కొత్తగా ఉంటాయి. అమ్మ పాత్రని దర్శకుడు మలిచిన తీరు ఆకట్టుకుంది. హీరో హీరోయిన్ల మానసిక సంఘర్షణ హృదయాలను ఎంతగానో హత్తుకుంటాయి.తండ్రి కూతుళ్ల బాండింగ్‌ని తొలి సీన్‌లోనే చూపిస్తూ చాలా ఎమోషనల్‌గా కథను స్టార్ట్ చేశాడు దర్శకుడు. మహి తన తల్లిగా యష్ణని ఊహించుకున్నప్పటి నుంచి లవ్ స్టోరీ మొదలవుతుంది. అయితే విరాజ్‌, వర్షల పరిచయం.. ప్రేమ.. పెళ్లి...ఇవన్నీ రొటీన్‌గా అనిపిస్తున్నాయి. కథనం నెమ్మదిగా సాగడం  కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఒక్కసారి ట్విస్ట్‌ అనేది రివీల్‌ అయ్యాక.. గుండె బాగా బరువెక్కుతుంది. ఇక ఇంటర్వెల్‌ సీన్‌ ద్వితియార్థంపై ఆసక్తి పెంచుతుంది.


సెకండాఫ్‌లో భావోద్వేగాలు చాలా బలంగా రాసుకున్నాడు దర్శకుడు. అయితే కొన్ని చోట్ల సాగదీసినట్లు అనిపించినా.. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారు. సన్నీవేశాలతో కాకుండా సంభాషణలతో కూడా ప్రేక్షకులను బాగా ఎమోషనల్‌కు గురి చేశాడు.  ప్రతిదీ కూడా గుండెల్ని పిండేస్తుంది. క్లైమాక్స్‌లో జయరామ్‌ పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ఎంతో ఆకట్టుకుంటుంది. ఇక కథనం నిదానంగా సాగినప్పటికీ.. కొన్ని ట్విస్టులు.. ప్రధాన పాత్రలు పండించిన భావోద్వేగాలు కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.మొత్తానికి సినిమా చాలా బాగుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: