
ఈ సినిమాతో మీనాక్షి చౌదరికి వస్తున్న క్రేజీ ను సద్వినియోగం చేసుకుంటూ చిన్న పెద్ద అని తేడా లేకుండా హీరోలతో వరుస సినిమాలకు కమిట్మెంట్ అవుతూ బిజీ హీరోయిన్గా మారిపోతోంది. ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా డైరెక్టర్ బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ఇమే హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటించింది.. ఇందులో మొత్తం ముగ్గురు కథానాయకులు కాదా ఇందులో మీనాక్షి చౌదరి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు చిత్రబృందం..
ఒకవేళ ఇదే కనుక నిజమైతే మీనాక్షి చౌదరి క్రేజ్ మరింత పెరిగిపోతుందని బాలయ్య అభిమానులు తెలుపుతున్నారు.. ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాలతో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు తమిళ హీరో విజయ్ దళపతి నటిస్తున్న సరికొత్త ప్రాజెక్టులో నటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని ఒకవైపు సినిమా సెట్ లో ఉండగానే మరొక సినిమా అవకాశాలను పట్టేస్తోంది మీనాక్షి చౌదరి. రెమ్యూనరేషన్ పరంగా కూడా కాస్త తక్కువగానే తీసుకుంటూ ఉండడంతో అవకాశాలు చాలా మెండుగానే వస్తున్నట్లు అభిమానులు తెలుపుతున్నారు. మరి ఏ మేరకు ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరుతుందో చూడాలి. వచ్చే ఏడాది ఈమె నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా విడుదలవుతున్నాయి.