హిందీ సినీ పరిశ్రమలో ఇప్పటికే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటీ మణులలో జాన్వీ కపూర్ ఒకరు. ఈ బ్యూటీ మరికొన్ని రోజుల్లోనే తెలుగు తెరకు కూడా పరిచయం కాబోతోంది. ప్రస్తుతం ఈ నటి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. 

అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ మొత్తం గా రెండు భాగాలుగా విడుదల కానుండగా మొదటి భాగం వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటి క్రెస్ సౌత్ లో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో అంతకు మించిన స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. 

ఇకపోతే అప్పుడప్పుడు మాత్రం ఈ బ్యూటీ తనకు సంబంధించిన క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా జాన్వి అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: