నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో మూవీ లను నిర్మించి తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన తాజాగా డెవిల్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి అభిషేక్ నామ దర్శకత్వం వహించగా ... సంయుక్త మీనన్ ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి జోడి గా నటించింది.

మూవీ పోయిన సంవత్సరం డిసెంబర్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకి పర్వాలేదు అనే స్థాయిలో కనెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించాడు. ఈ మూవీ లోని తన నటనతో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఈ మూవీ ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో కళ్యాణ్ రామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ... 2024 ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే దానిపై నేను నా తమ్ముడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఇంకా ఎటువైపు వెళ్లాలి అనే విషయం మేము డిసైడ్ కాలేదు అని కళ్యాణ్ రామ్ చెప్పుకోచ్చాడు. తాజాగా కళ్యాణ్ రామ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: