యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. పాన్ ఇండియా లెవెల్ లో కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. కాగా వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో మళ్ళీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో దేవర రాబోతోంది. కాగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డీ జోడిగా అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వికపూర్ కనిపించబోతోంది. దేవర సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం కానుంది జాన్వి కపూర్.

ఇప్పటికే చాలా తెలుగు సినిమాలతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నప్పటికీ అది జరగలేదు. ఆఖరికి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో జతకడుతూ తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఇటివల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈమె. ఇక ఇంటర్వ్యూలో భాగంగా తనకి సంబంధించిన పలు రకాల విషయాలను బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగానే దేవర సినిమాకి సంబంధించిన పలు జ్ఞాపకాలను చెప్పమని అడిగితే డైలాగ్స్ డాన్స్ అన్ని కూడా జరిగాయి అని చెప్పుకొచ్చింది జాన్వి కపూర్. అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ సెట్ చాలా సరదాగా ఉంటారు అని చెప్పింది.

ఎప్పుడూ అల్లరి అన్నది చేస్తుంటారు అని.. తన రియల్ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి నేను జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి బాగా ఎంజాయ్ చేశాను అని చెప్పింది.. అలాగే తల్లి శ్రీదేవి గురించి చెబుతూ.. తను అల్లరి చేసినప్పుడు.. అమ్మ రూమ్ కి వెళ్లి తెలియకుండా లిప్ స్టిక్స్ తీసుకున్నప్పుడు.. అమ్మ సరదాగా.. నా కొడకా.. అనేదని చెప్పింది. ఇలా పలు ఆసక్తికర విషయాలను ఈ ఇంటర్ వ్యూలో బయటపెట్టింది. జాన్వీ ఎన్టీఆర్ గురించి చెప్పిన సంగతులు, శ్రీదేవి గురించి చెప్పిన నా కొడకా.. డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొత్తానికి ఎప్పటి నుంచో జాన్వీ తెలుగు ఎంట్రీ కోసం వెయట్ చేస్తున్న ఫ్యాన్స్ కు దేవర పండగే అని చెప్పచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: