అయితే, హనుమాన్ విడుదలకు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా మంచు మనోజ్ హోస్ట్‌గా చేస్తున్న ఉస్తాద్ టాక్ షోకు అతిథిగా వెళ్లాడు తేజ సజ్జా. ఉస్తాద్ టాక్ షో 5వ ఎపిసోడ్‌కు తేజ సజ్జతోపాటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా హాజరు అయ్యాడు. ఈ షోలో తేజ సజ్జతో సరదాగా మాట్లాడాడు మంచు మనోజ్. తేజ సజ్జ ఎంట్రీ ఇచ్చి హనుమాన్ మూవీలోని ఓ మ్యానరిజం మనోజ్‌తో కలిసి చేశాడు.సాధారణంగా నా షోకి వచ్చినవారిని సరదాగా బాబాయ్, డార్లింగ్ అని పిలుస్తుంటాను. నిన్ను ఏమని పిలవాలి. నువ్ పాన్ ఇండియా స్టార్‌వి అని మంచు మనోజ్ అంటే.. నేను కాదన్న.. హనుమంతులు వారు పాన్ ఇండియా స్టార్ అని తేజ సజ్జ చెప్పాడు. తర్వాత నీ లైఫ్‌లో నీకు ఉస్తాద్ ఎవరని మంచు మనోజ్ అడిగితే.. చిరంజీవి గారు నాకు బిగ్గెస్ట్ ఇన్సిప్రేషన్.. ఉస్తాద్.. మెగాస్టార్.. ఎవ్రీథింగ్ అని తేజ అన్నాడు. దాంతో సూపర్ అని మనోజ్ చప్పట్లు కొట్టాడు.
అనంతరం స్క్రీన్‌పై ఇంద్ర సినిమాలో తేజ సజ్జా తొడ కొడుతుంటే.. మెగాస్టార్ చిరంజీవి అని పడే సీన్ చూపించారు. అలాంటి అదృష్టం ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందా అని మనోజ్ అన్నాడు. మన నేషనల్ క్రష్ రష్మిక.. ఆమె క్రష్ ఎవరైతే బాగుంటుంది అని మనోజ్ అడిగితే.. నేనైతే బాగుంటుందని అనుకుంటున్నా అని తేజ చెప్పాడు. తర్వాత మనకు డౌట్ వస్తే గూగుల్‌ను అడుగుతాం. గూగుల్‌కు డౌట్ వస్తే తమ్ముడిని అడుగుతుంది అని మనోజ్ అన్నాడు.అనంతరం ఆయనకు బ్లూ కలర్ అంటే బాగా ఇష్టం ఆయనకీ.. బ్లూ డ్రెస్సెసు.. ఫిల్మ్స్.. ఎవ్రీథింగ్ అని మంచు మనోజ్ అని గట్టిగా నవ్వడం స్టార్ట్ చేశాడు. షోలో తేజ సజ్జకు అభిమానిగా వచ్చిన వ్యక్తి కూడా తెగ నవ్వాడు. ఆ సమయంలో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇద్దరూ ఉన్నారు. అయితే, మంచు మనోజ్ ఎవరికీ బ్లూ కలర్ ఇష్టమంటూ అలా అన్నాడో తెలియలేదు. కానీ, మనోజ్ ఫిల్మ్స్ ఇష్టం అన్నాక తేజ సజ్జ సిగ్గుతో తల కొట్టుకున్నాడు.అలా తేజనే మంచు మనోజ్ అన్నాడని తెలుస్తోంది. ఇదంతా ఉస్తాద్ ప్రోమోలో చూపించలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియోకు నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి