ఈసంవత్సరం సంక్రాంతికి విడుదల అయిన భారీ సినిమాలు అన్నీ ఫ్లాప్ అయి ఒక చిన్న సినిమా ‘హనుమాన్’ సూపర్ సక్సస్ కావడం మారిన తెలుగు ప్రేక్షకులా అభిరుచిని తెలియచేస్తోంది. ప్రస్తుత తరం ప్రేక్షకులు రొటీన్ కథలను ఏమాత్రం ఆదరించరని సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల ఫలితం మరొకసారి తెలియచేస్తోంది.



‘హనుమాన్’ సూపర్ సక్సస్ కావడంతో ఈసంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ అదేవిధంగా చిన్న హీరోలకు కలిసి వచ్చే సంవత్సరంగా మారుతుందా అన్నా సందేహాలు కూడ కొందరికి వస్తున్నాయి. ముఖ్యంగా గత సంవత్సరం భయంకరమైన ఫ్లాప్స్ ను ఎదుర్కున్న మీడియం రేంజ్ హీరోలు నితిన్ రామ్ నాగచైతన్య నాని నిఖిల్ కిరణ్ అబ్బవరం ల కెరియర్ లకు ఈ సంవత్సరం విషమ పరీక్ష కాబోతోంది అంటూ మరికొందరు విశ్లేషణలు చేస్తున్నారు.



ప్రస్తుతం వరస ఫ్లాప్ లతో సత్యమతమైపోతున్న నితిన్ తనకు గతంలో ఒక సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుదుమల తో జతకట్టి తన అదృష్టాన్ని ఈ సంవత్సరం పరీక్షించుకోబోతున్నాడు. ఇదే పరిస్థితి మరొక హీరో రామ్ కు కూడ ఎదురవుతోంది. పూరీ జగన్నాథ్ తో మరొకసారి జతకట్టి ‘డబల్ స్మార్ట్’ అంటూ రాబోతున్నాడు. అక్కినేని కుటుంబం నుండి వచ్చిన నాగచైతన్య పరిస్థితి కూడ ఇలాగే ఉంది. అతడిని కూడ వరస ఫ్లాప్ లు వెంటాడుతున్నాయి.



చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న ‘తండల్’ మూవీ పై కూడ చాల ఆశలు పెట్టుకున్నాడు. ఈసినిమాను నిర్మిస్తున్నది అల్లు అరవింద్ గీతా సంస్థ కావడంతో ఈమూవీ తనకు ఖచ్చితంగా హిట్ తెచ్చి పెడుతుందని చైతూ ఆశ పడుతున్నాడు. దీనికితోడు ఈమూవీలో సాయి పల్లవి సాయి పల్లవి కూడ నటిస్తూ ఉండటంతో ఈమూవీ పట్ల మరిన్ని అంచననాలు పెరుగుతున్నాయి. వీరే కాకుండా ఫ్లాప్ లతో సతమతమౌతున్న విజయ్ దేవరకొండ నిఖిల్ మంచు విష్ణు వైష్ణవ్ తేజ్ లు నటిస్తున్న సినిమాలకు కూడ ఈ సంవత్సరం అత్యంత కీలకంగా మారింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: