ఫేక్ వీడియోలు క్రియేట్ చేసిన బాధ్యులను పట్టుకున్నందుకు ఢిల్లీ పోలీసులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నన్ను ప్రేమతో, మద్దతుతో ఆదరించి, నన్ను రక్షించే సమాజానికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అమ్మాయిలు, అబ్బాయిలు, మీ సమ్మతి లేకుండా మీ చిత్రాన్ని ఎక్కడైనా ఉపయోగించినట్టయితే, మార్ఫింగ్ చేసినట్టయితే అది నిజంగా తప్పు. ఇలాంటి సమయంలో మీకు మద్దతు ఇచ్చే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారని, చర్యలు తీసుకోబడుతుందని గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నా అని తెలిపింది రష్మిక. ఆమె పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇక ప్రస్తుతం రష్మిక మందన్నా.. పుష్ప 2`లో నటిస్తుంది. అల్లు అర్జున్‌కి జోడీగా చేస్తుంది. సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీ ఆర్‌ఎస్‌సీలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతోపాటు `ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్‌బో చిత్రాలు చేస్తుంది. కొత్తగా ధనుష్, నాగార్జున కాంబినేషన్‌లో రూపొందుతున్న శేఖర్ కమ్ముల మూవీలో హీరోయిన్‌గా ఎంపికైంది రష్మిక మందన్నా. అలాగే విజయ్ దేవరకొండ `ఫ్యామిలీ స్టార్`లోనూ ఓ సాంగ్‌లో మెరబోతుందని సమాచారం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి