
రజనీకాంత్ నటించిన నరసింహ సినిమాలో కూడా ఆయన కూతురు పాత్రలో నటించింది. వివాహమైన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన ప్రీతి 2002లో డైరెక్టర్ హరిని వివాహం చేసుకుంది.దీంతో పూర్తిగా కేవలం కుటుంబ జీవితానికి అంకితమయ్యింది సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్ గా ఉంటూ రెగ్యులర్గా పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది ప్రీతి.అయితే సినిమాలకు దూరమైనప్పటికీ బిజినెస్ లో మాత్రం భారీగానే రాణిస్తోంది ప్రీతి. చెన్నై సముద్ర తీరంలో కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసింది.
అలాగే అందుకు సమీపంలో ఒక మెట్రో కాఫీ ని కూడా ఏర్పాటు చేసింది పలు రకాల ఫ్రాన్సిజీలను కూడా ఏర్పాటు చేసింది ప్రీతి.అయితే ఇందులో పనిచేసే వారందరూ కూడా మహిళలే కావడం గమనార్హం.అంతేకాకుండా సాలి గ్రామంలోని సినీ ఎడిటింగ్ డబ్బింగ్ స్టూడియోలను కూడా నిర్మిస్తూ పలు రకాల బిజినెస్లను మెయింటైన్ చేస్తూ లక్షలలో సంపాదిస్తోంది ప్రీతి విజయకుమార్. ఇలా హీరోయిన్ గా ఫెడ్ అవుట్ అయినప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మ ఇలా బిజినెస్ ల ద్వారా కూడా భారీగానే ఆదాయాన్ని సంపాదిస్తుందని విషయం అభిమానులకు తెలియడంతో ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికి అడపా దడపా సినిమాలలో నటిస్తూనే ఉంది ప్రీతి విజయకుమార్.