దీనికితోడు ఈ పరిస్థితికి రవితేజా తీసుకున్న నిర్ణయాలు కూడ కొంతవరకు కారణమా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు మాస్ రొటీన్ సినిమాలు చేయడం ఇష్టం లేక గత కొన్ని సంవత్సరాలుగా తన సినిమాల ఎంపిక విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తుత రవితేజా పరిస్థితికి కారణం అయి ఉండవచ్చు అని మరికొందరి అంచనా.
చాల సంవత్సరాల క్రితం రవితేజా ‘ఆటోగ్రాఫ్’ ‘సారొచ్చారు’ ‘డిస్కో రాజా’ లాంటి వెరైటీ సినిమాలాలో నటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి రవితేజా నటించిన సినిమాలలో కొన్ని డిఫరెంట్ కధలే అయినప్పటికీ సగటు సినిమా ప్రేక్షకుడు రవితేజా ఎంపిక చేసుకున్న కధలలోని వెరైటీని పెద్దగా ఆదరించలేకపోయారు. మరీ ముఖ్యంగా రవితేజా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ ‘రావణాసుర’ భయంకరమైన ఫ్లాప్ లుగా మారడంతో రవితేజా చాల ఆలోచించి ‘ఈగల్’ మూవీలో నటించాడు.
ఈమూవీ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని భిన్నమైన స్క్రీన్ ప్లే హాలీవుడ్ స్టైల్ టేకింగ్‌తో ఈసినిమాను తీసినప్పటికీ ఈసినిమాకు మాస్ ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. ఈమూవీ నరేషన్ చాల స్లోగా ఉండడంతో పాటు ఏఏమూవీలోని పాటలు కూడ పెద్దగా హిట్ అవ్వకపోవడంతో ఈమూవీ మొదటిరోజు మొదటి షో నుండి డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఈమూవీ బయ్యర్లకు నష్టాలు తప్పవు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో రవితేజా కు ప్రయోగాలు కలిసి రావడంలేదు అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనికితోడు మీడియం రేంజ్ హీరోలు కూడ వంద కోట్ల టార్గెట్ ను చాల సులువుగా అందుకుంటూ ఉంటే ఈవిషయంలో కూడ రవితేజా వెనకంజలోనే ఉన్నాడు అనిపిస్తుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి