ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి యశ్రజ్ సంస్థ వారు ప్రస్తుతం ఎస్రాజ్ స్పై యూనివర్స్ పేరుతో పరుసగా సినిమాలను నిర్మిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటి వరకు ఈ యూనివర్స్ నుండి 5 సినిమాలు విడుదల అయ్యాయి. ఆ 5 సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి అనే విషయాలను తెలుసుకుందాం.

ఏక్త టైగర్ : ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన కత్రినా కైఫ్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 330 కోట్ల కలక్షన్ లను వసూలు చేసి ఆ సమయంలో భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

టైగర్ జిందా హై : సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 565 కోట్ల కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టి ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

వార్ : హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాలో టైగర్ షార్ప్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 475 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

పటాన్ : షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1060 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

టైగర్ 3 : సల్మాన్ ఖాన్ హీరో గా కత్రినా కైఫ్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా 465 కోట్ల కలెక్షన్ లను వసులు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: