ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగిన వారు ఆ తర్వాత కాలంలో ఇక అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఇండస్ట్రీకి దూరమైన సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అప్పుడప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అయితే ఇక అభిమానులు సైతం గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సినీ సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పుడు ఇలాంటి ఫోటోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఒకప్పుడు టాప్ కమెడియన్ గా ప్రేక్షకులను అలరించిన వ్యక్తి ఇక ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇక విలనిజంలో కూడా కామెడీ పండించి అందరినీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన నటుడి ఇక ఇప్పుడు బక్క చిక్కిపోయిన ఫోటో ఒకటి అభిమానులను సైతం అవక్కయ్యేలా చేస్తూ ఉంది. ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు సుధాకర్. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో పాటుగానే నటనలో ట్రైనింగ్ తీసుకున్నాడు ఇతగాడు. ఇక ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇక కామెడీ విలనిజం చూపించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇక కమెడియన్ గా కూడా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.


 ఇలా ఒకప్పుడు నవ్వులు పూయించిన సుధాకర్ ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాడు. ఒకవైపు వృద్ధాప్యం మరోవైపు ఆరోగ్య కారణాలవల్ల ఆయన బక్క చిక్కిపోయారు. అయితే ఇటీవలే సుధాకర్ కుమారుడి బెన్నీ వివాహం సందర్భంగా.. తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అప్పటికి ఇప్పటికీ సుధాకర్ అభిమానుల సైతం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు అని చెప్పాలి. ఇక ఈ వివాహానికి స్టార్ కమెడియన్ బ్రహ్మానందం నటులు జగపతిబాబు, జెడి చక్రవర్తి, ఉత్తేజ్ తదితరులు హాజరయ్యారు. అయితే మా అభిమాన నటుడు సుధాకర్ ఇలా అయ్యాడేంటి.. ఇంతకీ ఆయనకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి అని తెలుసుకునేందుకు అభిమానులు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: