ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్లలో కృతి శెట్టి పేరు ముందు వరుసలో ఉంటుంది. తన తొలి సినిమా ఉప్పెనతో యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది కృతి శెట్టి. అమ్మడి చురకత్తుల్లాంటి చూపులకు యువత పడిపోయింది. తనదైన నటనతో పాటు క్యూట్ లుక్స్‌తో యూత్ ఆడియన్స్‌కి వల వేసింది కృతి శెట్టి. దీంతో ఒక్కసారిగా ఈ హీరోయిన్ పాపులర్ అయింది. ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్స్ రావడంతో కృతి పేరు జనం నోళ్ళలో నానిపోయింది. ఉప్పెన తర్వాత నాని సరసన 'శ్యామ్ సింగ రాయ్', నాగ చైతన్య సరసన 'బంగార్రాజు' సినిమాల్లో నటించి

తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ రెండు సినిమాల్లో కూడా ఆమె నటనకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ పోతినేని హీరోగా వచ్చిన ది వారియర్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది కృతి శెట్టి. ఈ సినిమాలో రామ్ జోడీగా మంచి మార్కులు కొట్టేసింది. దీంతో అమ్మడి క్రేజ్ మరో మెట్టు ఎక్కింది. రీసెంట్ గా నాగచైతన్యతో కలిసి కస్టడీ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం ఈ అమ్మడి స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

ఈ క్రమంలో కృతి శెట్టి వరుసగా ఫొటోషూట్లు చేస్తోంది. సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తాజాగా కలర్ ఫుల్ డ్రెస్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది. కిర్రాక్ ఫోజులిస్తూ అదరగొట్టింది. ఇలా కృతిశెట్టి తమిళ తంబీలను వరుస చిత్రాలతో అలరిస్తోంది.... ఇక్కడ ఫ్యాన్స్ ను మాత్రం సోషల్ మీడియా దర్శనంతో ఆకట్టుకుంటోంది.  శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ తెర‌కెక్కుతోంది. శర్వానంద్ కు ఇది 35వ చిత్రం. బేబీ ఆన్ బోర్డ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ‌ర్వానంద్ కు తండ్రిగా ఓ కోలీవుడ్ హీరో న‌టించబోతున్నాడు. ఆ హీరో మ‌రెవ‌రో కాదు విజ‌య్ సేతుప‌తి. ఇప్ప‌టికే ఆయ‌న‌కు స్టోరీ న‌చ్చ‌డం.. సినిమా ఒప్పుకోవ‌డం జ‌రిగింది. విజ‌య్ సేతుప‌తి పాత్ర ఈ మూవీలో చాలా కీల‌కం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: