సాధారణంగా సినిమాల్లో నటించే వాళ్లకు మాత్రమే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కానీ, తెలుగు బుల్లితెరపై సందడి చేస్తున్న కొందరు సెలెబ్రిటీలు సైతం అదిరిపోయే అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.అలాంటి వారిలో ప్రముఖ కమెడియన్ కమ్ హీరో సుడిగాలి సుధీర్ ఒకడు. చాలా కాలంగా టీవీలో, సినిమాల్లో సత్తా చాటుతోన్న అతడు.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!
జబర్ధస్త్‌ షోతో స్టార్‌గా మారి:మ్యాజిక్‌లు చేస్తూ కెరీర్‌ను మొదలు పెట్టిన సుడిగాలి సుధీర్.. జబర్ధస్త్ షోలోకి ఆర్టిస్టుగా అడుగు పెట్టాడు. మొదట్లో స్కిట్లు చేసి అలరించిన అతడు.. ఆ తర్వాత టీమ్ లీడర్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి తనదైన స్కిట్లతో ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ గౌతమ్‌తో ట్రాక్‌తో మరింత ఫేమస్ అయ్యాడు. మొత్తానికి ఈ షో ద్వారా సుధీర్ స్టార్‌గా మారిపోయాడు.చాలా ఏళ్ల పాటు బుల్లితెరపై సత్తా చాటిన సుడిగాలి సుధీర్.. ఎన్నో సినిమాల్లోనూ కీలక పాత్రలను పోషించాడు. అదే సమయంలో హీరోగానూ మారి 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' వంటి సినిమాలు చేశాడు. కానీ, ఇవి అతడికి విజయాన్ని మాత్రం అందించలేదు. కానీ, 'గాలోడు'తో కెరీర్ బెస్ట్‌ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతో వరుసగా సినిమాలే చేస్తున్నాడు.

గాలోడు' వంటి హిట్ తర్వాత సుడిగాలి సుధీర్ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇటీవలే 'కాలింగ్ సహస్ర' అనే చిత్రంతో వచ్చాడు. కానీ, ఈ మూవీ అనుకున్న విధంగా ఆడలేదు. ఫలితంగా సుధీర్‌కు బిగ్ షాక్ తగిలినట్లు అయింది. ఇక, ఇప్పుడు ఈ టాలెంటెడ్ గాయ్ 'GOAT' అనే సినిమాలో నటిస్తున్నాడు. అది త్వరలోనే రిలీజ్ కాబోతుంది.సుడిగాలి సుధీర్ బుల్లితెరపై సెన్సేషన్ అయ్యాడు. అందుకే అతడు లేకున్నా జబర్ధస్త్ షోలో పేరును మాత్రం వాడుకుంటున్నారు. ఇలా వచ్చే శుక్రవారం ప్రసారం కానున్న ఎక్స్‌స్టా జబర్ధస్త్ షోలో సుడిగాలి సుధీర్‌ పేరును లాగుతూ బుల్లెట్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు, అతడి పరువు తీసేలా మాట్లాడాడు. పైగా సుధీర్ అభిమానులను సైతం ఫన్నీగా కెలికేశాడు.ఓ స్కిట్‌లో భాగంగా ఓ ఆర్టిస్టు 'సుధీర్ బాబు కాల్ చేస్తున్నాడు సార్' అన్నాడు. దీనికి బుల్లెట్ భాస్కర్ 'వాడికి చిలక్కి చెప్పినట్లు చెప్పాను. ఫిబ్రవరి, మార్చి పెళ్లిళ్ల సీజన్‌రా.. చక్కగా మ్యాజిక్ షోలు చేసుకోరా.. ఈవెంట్‌కు రూ. 5 వేలు ఇస్తారురా అని చెప్పాను' అని ఫన్నీగా సెటైర్లు వేశాడు. దీంతో యాంకర్ రష్మీ గౌతమ్‌తో పాటు అక్కడున్న వాళ్లంతా పకపకా నవ్వేశారు.ఆ తర్వాత భాస్కర్ 'ఈ స్కిట్ చూసి ఒరేయ్ బుల్లెట్ భాస్కర్ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా? ఎవర్రా మీరంతా? ఒక్కొక్కరు నాలుగు మెయిల్ ఐడీలతో కామెంట్లు పెడితే భయపడతామా? షకీలా సినిమా కింద మీకేం పనిరా? వీ వాంట్ సుధీర్ అంటారా? జాతకాల ప్రోగ్రామ్‌లో సుధీరన్న సూపరూ అంటారు' అంటూ సుధీర్ ఫ్యాన్స్‌పై పంచ్‌లు వేశాడు. దీంతో ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: