సినీ సెలెబ్రెటీల జీవితాలు తెరమీద ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక వారి పారితోషకాలు కూడా కోట్లలోనే ఉంటాయి. దీంతో ఇక సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా వారి పారితోషకాల గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయే వార్తలు చూసిన తర్వాత ఎన్నో ఊహించుకుంటూ ఉంటారు. జీవితం అంటే సినీ సెలబ్రిటీలదే. బ్రతికితే ఇలాగే బ్రతకాలి.. ఎంతో ఈజీగా కెమెరా ముందు నటిస్తే చాలు కోట్లకు కోట్ల రూపాయలు ఆదాయాన్ని సంపాదించవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ తెరమీద ఎంతో అందంగా కనిపించే సినీ సెలబ్రిటీల జీవితాలలో సామాన్యుడికి ఉండే బాధల కంటే కాస్త ఎక్కువగానే బాధలు ఉంటాయి అని అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చే ఘటనల ద్వారా అర్థమవుతూ ఉంటుంది.


 ఈ క్రమంలోనె ఇలాంటి ఘటనల గురించి తెలిసిన తర్వాత.. సినిమా తీయడం సినిమాల్లో నటించడం అంత ఈజీ ఏం కాదు అని అర్థమవుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో తమకు ఎదురయ్యే ఇబ్బందులను పెద్దగా బయటికి చెప్పుకునే వారు కాదు సెలబ్రిటీలు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఏకంగా సోషల్ మీడియా కారణంగా ఎలాంటి విషయం అయినా అభిమానులతో పంచుకోవడానికి అందరూ ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నడు. నిర్మాతల గురించి ఆలోచిస్తున్నా తప్ప లేకపోతే ఎప్పుడో ఇక్కడి నుంచి పారిపోయేవాడిని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.


 ఎప్పుడు డిఫరెంట్ సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు గౌతమ్ మేనన్. ఈ క్రమంలోనే అటు ధ్రువ నక్షత్రం అనే సినిమాను తీశాడు. 2016 లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ ఇప్పటివరకు ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. అయితే ధ్రువ నక్షత్రం సినిమా విషయంలో తమ కుటుంబం ఎంతగానో ఆందోళన చెందుతుంది అంటూ గౌతమ్ మేనన్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా పదే పదే వాయిదా పడుతుండడంతో అసలు మనశ్శాంతి లేకుండా పోయింది. నా భార్య నెల రోజులుగా ఈ సినిమా గురించి ఆలోచిస్తుంది. కేవలం పెట్టుబడి పెట్టిన వారి కోసమే ఇంకా ఉంటున్న.. లేదంటే ఏదైనా వెళ్లిపోవాలని అనిపిస్తుంది అంటూ గౌతమ్ మేనన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: