మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా గామి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మార్చ్ 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ మూవీ బృందం వారు ఈ రోజు అనగా ఫిబ్రవరి 29 వ తేదీన ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. 

తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రసాద్ పి సి ఎక్స్ మల్టీప్లెక్స్ హైదరాబాదు లో విడుదల చేయనున్నట్లు ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ విడుదల ఈవెంట్ కు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి విద్యాధర్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ లోని ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs