బాలీవుడ్ లో అందాల బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్స్ శ్రద్ధ కపూర్.. తనకంటూ ఒక ప్రత్యేకమైన సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మొదట్లో చాలా పద్ధతిగా కనిపించిన ఆ తర్వాత అవకాశాల కోసం గ్లామర్ గేట్లు ఎత్తేసింది.. శ్రద్ధా కపూర్ కు భారీ సంఖ్యలోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. 2011లో విడుదలైన లవ్ కాదది ఎండ్ సినిమాతో ఎంట్రి ఇచ్చింది ఆ తర్వాత ఆశికి -2 చిత్రంలో నటించడంతో ఈమె కెరియర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత వరుసగా సినిమాలలో నటిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ..


2014లో విడుదలైన హైదర్, ఏక్ విలన్, ABCD -2, తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది. ఈమె నటించిన యాక్షన్ కామెడీ చిత్రం శ్రీ సూపర్ హిట్ కాగా 2019లో సాహో సినిమాతో తెలుగుతేరకు ఎంట్రి ఇచ్చింది. సాహో సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తో కుర్రకారులను మరింత ఆకట్టుకుంది.. అలా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ బోల్డ్ సన్నివేశాలలో కనిపించి అందరిని ఆకట్టుకుంది.


2019 ఫోర్స్ టాప్ 100 సెలెబ్రెటీస్ జాబితాలో ఈమె పేరు కూడా సంపాదించుకుంది.. ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ .5 కోట్లకు పైగా రెమ్యూనరేషన్  తీసుకుంటోంది. పలు రకాల బ్రాండ్స్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఈమె ఆస్తిపాస్తులు కూడా భారీగానే సంపాదించుకుంది దాదాపుగా రూ .150 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి ఉన్నట్లు సమాచారం.. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ బ్యాగుల కోసం బూట్లు కోసమే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది ఈమె వద్ద రూ.10 కోట్ల రూపాయలు విలువైన బూట్లే ఉన్నాయట ఈ విషయం తెలిసి అభిమానుల సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.. కేవలం చెప్పుల కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చుచేసిన మొదటి హీరోయిన్ అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: