బాహుబలి సినిమాతో ఇండియాలో తెలుగు సినిమా చాలా శక్తివంతమైన సినిమాగా రూపొందితే, త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి ఒక వండర్ ని క్రియేట్ చేశాడనే చెప్పాలి.ఇక ఇప్పుడు మహేష్ బాబు తో కలిసి పాన్ వరల్డ్ లో తన సత్తా ఏంటో చూపించుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటివరకు వరల్డ్ సినిమాలు అంటే జేమ్స్ కామెరన్ , హిచ్ కాక్, క్రిస్టోఫర్ నోలాన్ లాంటి దర్శకుల సినిమాలే కనిపించేవి.కానీ మొదటిసారిగా రాజమౌళి తన ముద్రని ప్రపంచ సినిమా మీద వేయబోతున్నాడనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం దాదాపు వెయ్యి కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయిస్తున్నారు అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న రాజమౌళి అండ్ టీం… తొందర్లోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇక అందులో భాగంగానే మహేష్ బాబు లుక్కుని కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే మహేష్ బాబు ఈ సినిమాలో ఎలా కనిపించాలి అనే దానిమీద రాజమౌళి తన టీం తో కలిసి ఒక ఎనిమిది లుక్స్ ని రెడీ చేసినట్టుగా తెలుస్తుంది.

అందులో మహేష్ బాబు ఎలా కనిపిస్తున్నాడు అనేదాన్ని ఫోటోషూట్ ద్వారా తెలుసుకొని దాంట్లో ఒక లుక్ ను తీసుకొని ఈ సినిమా షూట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే మహేష్ బాబు కొంచెం గడ్డం తో పొడుగాటి జుట్టుతో ఈ సినిమాలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన చిన్న పాయింట్ ని మిస్ చేయకుండా రాజమౌళి దగ్గరుండి చూసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇంతకుముందే రాజమౌళి వాళ్ళ ఫాదర్ అయిన విజయేంద్రప్రసాద్ ఈ కథ గురించి మాట్లాడుతూ ఇది అమెజాన్ అడవుల్లో అడ్వెంచర్స్ తో సాగే సినిమాగా తెరకెక్కనుంది అని ఒక హింట్ అయితే ఇచ్చాడు.ఇక దాంతో మహేష్ బాబు అభిమానులు ఈ సినిమాలో మహేష్ బాబుని ఈసారి చాలా కొత్తగా చూడబోతున్నాం అంటూ ఇప్పటికి సోషల్ మీడియా వేదికగా విపరీతమైన హంగామా చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుంది. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది తెలియాలి అంటే రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా మీద స్పందిస్తే తప్ప ఈ సినిమాకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియదు. ఇక తొందర్లోనే రాజమౌళి ప్రెస్ మీట్ కి రెడీ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది…ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన కెరియర్ లో మురారి, పోకిరి, శ్రీమంతుడు సినిమాలు తనకు టైం పెరియడ్ ను బట్టి తను కథల్లో మార్పులు చేసుకుంటూ వచ్చిన సినిమాలను అవి తనని చాలా కొత్తగా ప్రజెంట్ చేశాయని చెప్పాడు. అలాగే సినిమాల్లో క్యారెక్టర్లు కూడా తన నిజ జీవితానికి దగ్గర గా ఉండేవే తను ఎక్కువగా చేస్తానని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: