టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అవి ఏవి అనే విషయాలను తెలుసుకుందాం.

శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఓ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఈ సినిమా లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లు అవి పెద్దగా విడుదల చేయలేదు . ఇక పోతే ఈ రోజు అనగా మార్చి 6 వ తేదీన ఈ మూవీ యొక్క టైటిల్ ను విడుదల చేయబోతున్నారు . ఒకే ఒక జీవితం సినిమా తర్వాత శర్వానంద్ నుండి రాబోతున్న సినిమా కావడం తో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో కాస్త మంచి అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత శర్వానంద్ ... అభి లాష్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా శర్వానంద్ కెరీయర్ లో 36 వ మూవీ గా రూపోంద బోతుంది.


ఇకపోతే అభిలాష రెడ్డి ఇది వరకు లుజర్ అనే వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించాడు . ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది . ఈ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఈ రోజు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక శర్వా తన కెరీర్ లో 37 వ మూవీ ని సామజవరగమన మూవీ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం లో చేయబోతున్నాడు. ఈ మూవీ ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈ రోజు వెలువడబోతుంది. ఇలా శర్వా చేతిలో ప్రస్తుతం ఈ మూడు క్రేజీ సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: