ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా మధ్యమాలలో ఆల్రెడీ రిలీజ్ ఐ హిట్ అయిపోయిన సినిమాలలో ఉన్న మైనస్ పాయింట్లను కూడా తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.అంతేకాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారు ఇప్పుడు ఎలా మారారో ఫోటోలు చూపిస్తూ సంతృప్తి చెందుతున్నారు.ఇక తాజాగా నాగార్జున హీరోగా నటించిన బంగారు రాజు మూవీ విషయంలో కూడా అదే జరిగింది. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అయి హిట్ అయిపోయినప్పటికీ ప్రస్తుత కాలంలో ఈ మూవీ లో ఉన్న ఒక మైనస్ పాయింట్ను టర్న్ చేస్తున్నారు. మరి ఆ మైనస్ పాయింట్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కృతి శెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ 2022 జనవరి 14న రిలీజ్ అయింది.ఇక ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా ప్రపంచవ్యాప్తంగా రూ. 66 కోట్లను కూడా సంపాదించుకుంది. అలాంటి ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త వైరల్ గా మారింది. ఒక సీన్ లో నాగచైతన్యకి ఎద్దుకి మధ్యలో ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది. అది ప్రతి ఒక్కరి ఫేవరెట్ కూడా. ఇక అక్కడే నుంచుని అంతా చూస్తున్న బంగారు రాజు ఆత్మ ఎద్దును బసవ అని పిలవగానే అది బంగారు రాజు వైపు చూసి కూర్చుంటుంది.ఇక అప్పుడు బంగారు రాజు మనవాడే వదిలేసేయ్ అనగానే ఆ ఎద్దు నాగ చైతన్యాన్ని వదిలేస్తుంది. నిజానికి ఒక ఎద్దు జీవితకాలం 20 సంవత్సరాలు మాత్రమే. కానీ బంగారు రాజు చనిపోయి అప్పటికే దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. ఎద్దు బతికేది 20 సంవత్సరాలు అయితే ఇంకా ఎలా ఉంది? ఈ చిన్న మిస్టేక్ ని ఎలా మర్చిపోయారు. ఏదేమైనా ప్రస్తుత కాలంలో ప్రతి సీన్ ని కూడా ఆచితూచి డైరెక్ట్ చేయకపోతే ఇలాగే ట్రోల్స్ కి గురవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: