మరొక సంవత్సరం గడిస్తే చాలు 70 సంవత్సరాల వయస్సు వాడు అయిపోతాడు. ఇలా రోజురోజుకి తన వయస్సు పేరుగుతున్నా ఆవిషయాన్ని పట్టించుకోకుండా మరింత రెట్టింపు ఉత్సాహంతో చిరంజీవి తన భవిష్యత్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘విశ్వంభర’ పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.ఆ అంచనాలను చేరుకోవడానికి మెగా స్టార్ తనవంతు కృషిని కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘విశ్వంభర’ కు సంబంధించిన ఒక చిన్న టీజర్ ను  వదిలిన  విషయం  తెలిసిందే ..అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చూసిన వారు మాత్రం ఈ మూవీ చిరంజీవి గతంలో నటించిన ‘జగదీక వీరుడు అతిలోక సుందరి’ మూవీ ఛాయలతో ‘విశ్వంభర’ ఉంటుంది అన్నప్రచారం జరుగుతోంది.వాస్తవానికి ‘విశ్వంభర’ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ మరొక రేంజ్ లో ఉంటాయి అన్న లీకులు కూడ వస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి దగ్గర కొన్ని ఆలోచనలు ఉన్నాయి అని అంటున్నారు. ‘విశ్వంభర’ మూవీ షూటింగ్ ఇంచుమించు పూర్తి అయినట్లే అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈమూవీ షూటింగ్ ను చిరంజీవి పూర్తి చేసినప్పటికీ చిరంజీవి తన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేయవలసి ఉంది అని అంటున్నారు. అయితే ఈమూవీ భారీ గ్రాఫిక్స్ తో కూడుకున్నది కావడంతో మూవీ రిలీజ్ కాకుండానే మెగా స్టార్ మరొక ప్రాజెక్ట్ వైపు అడుగులు వేస్తున్నట్లు టాక్.హరీష్ శంకర్ డైరెక్షన్ లో పీపుల్స్ మీడియా సంస్థ ఒక సినిమాను నిర్మించవలసి ఉంది. ఈసినిమాకు సంబంధించి కథ ఫైనల్ అయినప్పటికీ కొన్ని కారణాలు వల్ల ఈమూవీ ప్రాజెక్ట్ వెననక్కు వెళుతోంది అని అంటున్నారు. అదేవిధంగా తమిళ దర్శకుడు హరి చిరంజీవికి ఒక కథ రెడీ చేశాడు అన్న వార్తలు కూడ వస్తున్నాయి. ఈమూవీ గురించి ఇంకా క్లారిటీ రాకుండానే దిల్ రాజ్ అనీల్ రావిపూడిల కాంబినేషన్ లో ఒక అవుట్ అండ్  కామిడీ సినిమాకు అనీల్ రావిపూడిఒక కథ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనితో ఈముగ్గురు దర్శకులలో ఎవరి వైపు చిరంజీవి అడుగులు వేస్తాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి.. ఒక కథ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనితో ఈముగ్గురు దర్శకులలో ఎవరి వైపు చిరంజీవి అడుగులు వేస్తాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి..
మరింత సమాచారం తెలుసుకోండి: