టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌ సంపాదించుకుని బిజీగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్‌కు పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ దక్కింది.అయితే ప్రభాస్ పాన్‌ ఇండియా హీరోగా మారక ముందే బాలీవుడ్ సినిమాలో నటించాడన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇంతకీ ప్రభాస్ నటించిన ఆ బాలీవుడ్ సినిమా ఏంటో.. అందులో ప్రభాస్ రోల్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. బాహుబలి కంటే ముందే ప్రభాస్ బాలీవుడ్ మూవీ యాక్షన్ జాక్సన్ సినిమాలో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్‌లో కనిపించాడు.కొన్ని సెకండ్లు మాత్రమే ప్రభాస్ ఈ సినిమాలో మెరిశాడు. ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సస్‌ కాలేదు. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ నటించిన విషయం అంతగా హైలెట్ కాలేదు. కాగా ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా డేట్స్ విషయంపై ఒకింత కన్ఫ్యూజన్ మొదలైంది. మే 9వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నా ఎన్నికల షెడ్యూల్ ఇబ్బందిగా మారుతుందని.. ఏపీ, తెలంగాణ ఎలక్షన్స్ నేపథ్యంలో రిలీజ్ డేట్ ను మార్చనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్ సక్సెస్ సాధిస్తే.. పాన్ ఇండియా లెవెల్ లో మరింత క్రేజ్ పెరగటం కాయం.కల్కి సినిమా రిలీజ్ డేట్ మారితే మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ వాయిదా పడే అవకాశాలు ఉండడంతో.. ఫ్యాన్స్ లో ఏం జరుగుతుందో అనే చర్చలు మొదలయ్యాయి. ఇక ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న కల్కి సినిమాతో మరో భారీ సక్సస్ అందుకోవడం ఖాయం అని ఫ్యాన్స్ తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ నుంచి చివరికి వచ్చిన సలార్‌ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.800 కోట్ల గ్రాస్వసులను కొల్లగొట్టి సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. వరుస ప్లాపుల తర్వాత కూడా ప్రభాస్ సలార్ తో ఈ రేంజ్‌లో హిట్ కొట్టడం అంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: