తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలు అయిన రవితేజ , నితిన్ , నాని ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నారు . వీరు ప్రస్తుతం ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అనే విషయాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ మూవీ లో భాగ్య శ్రీ హీరోయిన్ గా నటిస్తోంది . ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు లక్నో లో రవితేజ పై భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.

టాలీవుడ్ యువ నటుడు నితిన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వం లో రూపొందుతున్న తమ్ముడు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం మారేడు మిల్లి మరియు ఆ పరిసర ప్రాంతాల్లో నితిన్ మరియు మరి కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు నాని మరియు మరి కొంత మంది ఇతరులపై "బీ హెచ్ ఈ ఎల్" లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూడు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: